ఐదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాల తయారీ – పర్యావరణ పరిరక్షణకు యువకుడి వినూత్న ప్రయత్నం
7టీవీ ఫోకస్ 13-09 శామీర్‌పేట మండలం, ఉప్పర్‌పల్లి గ్రామం:వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన మైనబోయిన అనిల్ గత ఐదు సంవత్సరాలుగా స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్ననాటి నుంచి వినాయకుడిపై భక్తి, కళలపై ఆసక్తితో విగ్రహాల తయారీని ప్రారంభించిన అనిల్, ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు, హానికరమైన పదార్థాలు ఉపయోగించకుండా సహజమైన మట్టితో విగ్రహాలను తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రస్తుతం ఆయన రూపొందించిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విగ్రహానికి కళాత్మకంగా రంగులు అద్దడంతో పాటు, సంప్రదాయ రూపాన్ని కాపాడే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విగ్రహ...
⏱ Top Story
👁 65 Views |
⬇️ 1 Downloads