ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్‌ను తక్కువగా అంచనా వేయకండి: దినేశ్ కార్తీక్
7tv focus : న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే కుల్‌దీప్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న వేళ.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతడి ఆటతీరును పూర్తిగా తప్పుబట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.రన్‌అప్, బంతిని విడుదల చేసే విషయంలో కుల్దీప్ ఇంకా మెరుగ్గా చేయాల్సిందని అనిపించింది. అయితే ప్రాక్టీస్‌లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వేరు.. మైదానంలోకి దిగి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం వేరు. కుల్‌దీప్‌కు ఇటీవల కాలంలో తుది జట్టులో చోటు దక్కడం లేదు. అకస్మాత్తుగా అవకాశం వస్తే...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads