bharat_V_jpg--816x480-4g
7TV Focus News

 ఓటీటీలోకి కంగనా రనౌత్ ‘భారత భాగ్య విధాతా’.. 

7tv focus : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘భారత భాగ్య విధాతా’ డిజిటల్ స్ట్రీమింగ్ రంగానికి సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా, ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ముంబైని వణికించిన భయానక 26/11 ఉగ్రదాడుల యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ చీకటి రాత్రి ముంబైలోని కామా అసుపత్రిలోప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, ఉగ్రవాదుల తూటాలను సైతం లెక్కచేయకుండా రోగులు, గర్భిణీలను కాపాడిన సాధారణ ఆసుపత్రి సిబ్బంది, నర్సులు, వార్డు బాయ్‌ల త్యాగనిరతిని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article