కమిటీ కూర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్..
ఢిల్లీ 7tv focus : జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో పోలీసులు బలప్రయోగంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూర్పుపై వివాదం నెలకొంది. జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కమిటీ సభ్యుల ఎంపికపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణన్, ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసుల బలప్రయోగం, దాడులపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.అయితే కమిటీ కూర్పు నిష్పాక్షికంగా లేదన్న అనుమానాలు తమకు ఉన్నాయని, ప్రస్తుత కమిటీ స్థానంలో కొత్త కమిటీని నియమించాలని పిటిషనర్ల న్యాయవాదులు సీజేఐ ధర్మాసనాన్ని కోరారు....
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads