కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా
7tv focus : రాష్ట్రంలో రైతులు పంట నష్టాలతో అల్లాడుతుంటే మంత్రులు మాత్రం హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ప్రారంభోత్సవాలకు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్న ప్రభుత్వం.. పంటలు నష్టపోయిన రైతుల కష్టాలను పరిశీలించేందుకు మాత్రం వాటిని వినియోగించడం లేదని మండిపడ్డారు. ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని రవిచంద్ర తెలిపారు. ఇంతటి విపత్తు సంభవించినా ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం లేదని విమర్శించారు. జిల్లాలో మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన కూడా...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads