కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయాలి
గుర్రంపోడు7tv focus : గుర్రంపోడు మండలంలోని తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన 32 కల్యాణలక్ష్మీ- షాదీ ముబారక్ చెక్కులను వెంటనే లబ్ధిదారులుకు అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతు బీమా ప్రవేశ పెట్టి అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఆగస్టు 14న గడువు ముగిసినా పునరుద్ధరణ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు.
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads