spos_V_gif--816x480-4g
7TV Focus News

 క‌శ్మీర్‌లో ఎస్‌పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాల‌తో మృత‌దేహాలు ల‌భ్యం

7tv focus : జ‌మ్మూక‌శ్మీర్‌లోని కిస్టావ‌ర్ జిల్లాలో పెట్రోలింగ్‌కు వెళ్లిన ఇద్ద‌రు స్పెష‌ల్ పోలీసు ఆఫీస‌ర్లు అదృశ్య‌మైన ఘ‌ట‌న తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రు ఆఫీస‌ర్ల మృత‌దేహాల‌ను ఇవాళ దచాన్ ప్రాంతంలో గుర్తించారు. ఆ ఆఫీస‌ర్ల త‌ల‌, శ‌రీర భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఉగ్ర‌వాదులు ఆ ఇద్ద‌ర్ని చంపి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. డెహ్రానా, కియార్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఇద్ద‌రు ఆఫీస‌ర్ల‌ను కిడ్నాప్ చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. మృతిచెందిన ఆఫీస‌ర్ల‌ను రాశ్‌పాల్ కుమార్‌, బాబీ చాంద్‌గా గుర్తించారు. కియార్ ఏరియాలో పోస్టింగ్‌లో ఉన్న ఆ ఇద్ద‌రూ బుధ‌వారం పెట్రోలింగ్ డ్యూటీ కోసం వెళ్లారు. ఇద్ద‌రు ఆఫీస‌ర్లు మిస్ కావ‌డంతో వారి కోసం నిన్న‌టి నుంచి గాలింపు చేప‌ట్టారు....
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article