Dalits-Complaints_V_jpg--816x480-3g
7TV Focus News

కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు

 7tv focus : జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన దళితులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావువేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో దళితులు ఫిర్యాదు చేశారు.గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కారణంతో నిజాంసాగర్‌ , పెద్దకొడంగల్‌ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన దళితులను లక్ష్యంగా చేసుకుని భూముల రీ సర్వేకు ఒత్తిడి చేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.2005లో ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా దళితులకు చట్టబద్ధంగా కేటాయించిన భూములపై రీ సర్వే చేయాలంటూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే తరచూ ఫిర్యాదు లు చేస్తున్నారని ఆరోపించారు. తమ భూములకు రక్షణ కల్పించి, వేధింపుల నుంచి విముక్తి కల్పించడంతో పాటు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు.
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article