కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం ధర్నా
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 10: కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర శాఖ మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఫీజుల దోపిడీని అరికట్టి విద్య హక్కు చట్టం, ఫీజుల నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads