కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి: ఎఐటీయూసీ
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ ఎఐటీయూసీ నాలుగో మండల మహాసభలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ ఎఐటీయూసీ నాలుగో మండల మహాసభ ఎస్‌సీ కమ్యూనిటీ హాల్‌లో మండల అధ్యక్షుడు ఆశి యాదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర మున్సిపల్ సంఘం కార్యదర్శి జైపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు యేసురత్నం, ఎఐటీయూసీ ఉపాధ్యక్షుడు పాలబిందల శ్రీనివాస్, మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షుడు హరినాథరావు హాజరై ప్రసంగించారు....
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads