కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ గ్రామం విమానపురి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 286వ వార్డు పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం, విమానపురి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ఎల్పీ విప్ కేపీ వివేకానంద్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని...
⏱ Top Story
👁 26 Views |
⬇️ 0 Downloads