‘కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉపసహరించండి’..
రాంచి 7tv focuis : జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విద్యార్థి నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆగస్ట్ 20న సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని వారు స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో నిర్వహించిన నియామక పరీక్షలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విద్యార్థులు గత 22 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. శనివారం దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాంచిలో ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు. తమ డిమాండ్లపై స్పందించని సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఆగస్ట్ 20న ముఖ్యమంత్రి నివాసాన్ని మేం ముట్టడిస్తాం. జేఎంఎం, కాంగ్రెస్ రెండూ మాతో రాజకీయాలు చేస్తున్నందున ఆయన రాజీనామాను మేం కోరుతున్నాం. ఒకవేళ...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads