cr-20261028_bbb998e69cfccaef
7TV Focus News

కేటీఆర్ పాస్‌పోర్ట్ వివాదం.. యథాతథ స్థితి కొనసాగించాలన్న హైకోర్టు

ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన పాస్‌పోర్ట్‌కు సంబంధించి జారీ అయిన నోటీసుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో విచారణ జరుపుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి (ఆర్‌పీవో) లేఖ రాసింది. ఏసీబీ అభ్యర్థన మేరకు పాస్‌పోర్ట్ అధికారులు కేటీఆర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం,...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article