కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం
7tv focus : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌మెట్‌పల్లిలోని నివాసంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల దాడి ని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ తీవ్రంగా ఖండించారు. డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించడాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నివాసంపై ముట్టడికి దిగడం వారి రాజకీయ అసహనానికి నిదర్శనమని ఆరోపించారు.గతంలో కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి, ప్రజలకు అందించిన సేవలను గుర్తించిన ప్రజలు, ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మంచి వైద్యుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads