క్లెయిమ్ అక్కర్లేదు.. ఖాతాలోనే పీఎఫ్ సొమ్ము: ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్!
7tv focus : సంస్థలు మారినప్పుడు లేదా ఉద్యోగాలు వదిలేసినప్పుడు పాత పీఎఫ్ ఖాతాల్లో మిగిలిపోయే చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవడానికి పడుతున్న శ్రమకు ముగింపు పలికేలా ఈపీఎఫ్‌వో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా నిష్క్రియాత్మకంగా పడి ఉన్న పాత పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ సొమ్ము ఉన్నట్లయితే సదరు సభ్యులు ఎటువంటి క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమెటిక్‌గా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1న ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నూతన సదుపాయాన్ని అధికారికంగాప్రారంభించారు.ఆటో సెటిల్మెంట్ నిబంధనలు: ఎవరు అర్హులు?...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads