ఖమ్మంలో అరాచకాలకు మంత్రి తుమ్మల ప్రోత్సాహం
ఖమ్మం 7tv focus : నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఅరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్విమర్శించారు. గతంలో తనపై ‘కాశీం రజ్వీ’ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడి వెంట ఉంటూ ఇసుక, మట్టి, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఖమ్మం నగర ఖానాపురం హవేలి పరిధి బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళన సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకునే విధంగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నడూ ‘జై తెలంగాణ’ అనని తుమ్మలను కేసీఆర్ మంత్రిని...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads