assam_V_jpg--816x480-3g
7TV Focus News

ఖాజీరంగాలో ట్ర‌క్కు, బ‌స్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు

7tv focus : అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఖాజిరంగాలో ఓ మినీబ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 23 మంది మృతిచెందారు. ఏడు మంది గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. ఖాజీరంగ స‌మీపంలో ఉన్న రోంగాజ‌న్‌లో యాక్సిడెంట్ జ‌రిగింది. బోకాఖాట్ నుంచి నాగావ్‌కు వెళ్తున్న మినీబ‌స్సును ట్ర‌క్కు ఢీకొట్టింది. రెండు వాహ‌నాలు ఢీకొన‌డం వ‌ల్ల మినీబ‌స్సు నుజ్జునుజ్జు అయ్యింది. బ‌స్సులోనే అనేక మంది చిక్కుకుపోయారు. పోలీసులు, స్థానికులు ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని గోలాఘాట్ ఎస్పీ స్వ‌ప్న‌నీల్ దేకా తెలిపారు.
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article