గతంలో కంటే డేంజరస్‌గా కోహ్లీ ఫామ్
7tv focus : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా.. అతడి ఆటలో మాత్రం జోరు తగ్గడం లేదు. కెరీర్ చివరి దశలోనూ వన్డేల్లో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసురుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడా? అంటే దక్షిణాఫ్రికా దిగ్గజం, కోహ్లీ మాజీ ఆర్సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్ మాత్రం అవుననే అంటున్నాడు. 2016-17లో కనిపించిన కోహ్లీ కంటే ఇప్పుడు మరింత మెరుగైన ఆటగాడిగా మారాడని అభిప్రాయపడ్డాడు.‘2016తో పోలిస్తే ఇప్పుడు కోహ్లీ మరింత మెరుగైన ఆటగాడని నేను భావిస్తున్నా. మైదానంలో అతడు ఎంత ప్రశాంతంగా ఉంటున్నాడో గమనించవచ్చు. పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. గతంలో...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads