గుంజోటి సర్పంచ్‌కు హైకోర్టులో ఊరట..
7tv focus : జహీరాబాద్, సెప్టెంబరు 16: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గుంజోటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సర్పంచ్ చెక్ పవర్‌ను నెల రోజుల పాటు నిలిపివేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. అక్టోబరు 6, 2026 వరకు గుంజోటి గ్రామ అభివృద్ధి పనుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. న్యాల్కల్ మండలం గుంజోటి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్డు పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ చెక్ పవర్‌ను నిలిపివేస్తూ...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads