గురుకుల విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి, జూలై 7 (7టీవీ ఫోకస్): విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, వారి కలలను సాకారం చేసుకునే దిశగా ప్రభుత్వం అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. సోమవారం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి చదువు, వసతి, భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి కూర్చొని చదువు, ఆటలు, భవిష్యత్ ఆశయాలు, పోటీ పరీక్షల సన్నాహకంపై సరదాగా ముచ్చటించారు. మంచి విద్యే విజయానికి పునాది అని, పట్టుదలతో కృషి చేస్తే ఏ ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించవచ్చని వారికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలు, కోరికలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 1 Downloads