గొట్టిముక్కల పద్మారావు సేవలు చిరస్మరణీయం
కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా హైదరాబాద్, జూన్ 23 (7టీవీ ఫోకస్ ప్రతినిధి): తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం కూకట్‌పల్లిలోని పద్మారావు నివాసానికి వెళ్లిన కేటీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొట్టిముక్కల పద్మారావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీ బలోపేతంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ సమాజం...
⏱ Top Story
👁 43 Views |
⬇️ 0 Downloads