cr-20261027_d542b218216ecd1c
7TV Focus News

గ్రావిటీతో నీళ్లిస్తే రాజీనామా చేస్తా: ప్రభుత్వానికి హరీశ్‌రావు సవాల్

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సాధ్యమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. గ్రావిటీతో నీళ్లు వస్తాయని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీశ్ ఆరోపించారు. "ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్‌ తెచ్చిన కరవు" అని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నా ఎత్తిపోతలు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను నష్టపరుస్తోందని...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article