చండూర్ సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు..
7tv focus : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు మంగళవారం ముట్టడించారు. వరి పంటలు చివరి దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో లో-వోల్టేజీతోపాటు తరచూ ట్రిప్పింగ్ జరుగుతోందని రైతులు తెలిపారు. దీంతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో సాగునీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. రోజుకు 9 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads