SI-Lingam_V_jpg--816x480-4g
7TV Focus News

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు

7tv focus : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్సై లింగం హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా విద్యార్థులు, యువకులు గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. గంజాయి, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, గుట్కా జూదం వంటి అంశాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు.
⏱ Top Story 👁 29 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article