chunchupalli_V_jpg--816x480-3g
7TV Focus News

చికిత్స పేరుతో మ‌హిళ‌కు వేధింపులు.. 

7tv focus : వైద్యం పేరుతో వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెంలోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో పని చేస్తున్న వైద్యుడు నాడికూడి శైలేష్ కుమార్ (39)పై చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ రవికుమార్‌తో క‌లిసి కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 114/2026గా భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article