sugarcane-farmers_V_jpg--816x480-4g
7TV Focus News

చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన

 7tv focus : చెరుకు రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాభావంతో దిగుబడి తగ్గిపోగా, మరోవైపు ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు పెరగడంతో పెట్టుబడి భారంగా మారింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని జహీరాబాద్ డివిజన్ చెరుకు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సగానికి పడిపోయిన దిగుబడి.. పెరిగిన ఖర్చులు ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరుకు పంట ఎదుగుదలపై ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరాకు 45 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 20 నుంచి 25 టన్నులకే పరిమితమవుతోందని ఆవేదన...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article