hand_pawan_5e8791cd9d_V_jpg--625x351-4g
7TV Focus News

చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి, 7tv Desk : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులు, కళాకారులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం గల చేతులను గౌరవిద్దామని అన్నారు. ప్రతి చేనేత వస్త్రం మన సంస్కృతిని, చేతిపనితనాన్ని, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. చేనేతను ఎంచుకోవడం ద్వారా, దేశ సంప్రదాయాలను పరిరక్షించుకోవడంతో పాటు నేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణమన్నారు.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article