ఛాతివ్యాధుల ఆస్పత్రిలో మూతపడిన విభాగాలు
7tv focus : ఎర్రగడ్డలోని ఛాతివ్యాధుల ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తారు. ఛాతివ్యాధులకు, టీబీకి సంబంధించి ఇక్కడ చికిత్స పొందుతుంటారు. రోజుకు వందలాది మంది ఓపీ చికిత్స పొందుతుండగా, కొంతమంది ఆస్పత్రిలో చేరుతుంటారు. ఆస్పత్రిలో చేరేవారికి సరైన వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఫిమేల్ వార్డు, మేల్ వార్డు, స్వైన్‌ఫ్లూ వార్డులను పూర్తిగా మూసివేశారు. ఉన్న వార్డుల్లో రోగులకు వైద్యం అందిస్తున్నారు. కేర్ అండ్ సపోర్టు సెంటర్‌లోనే చికిత్స ప్రస్తుతం నూతన భవనమైన కేర్ అండ్ సపోర్టు సెంటర్‌లోనే రోగులందరికీ చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, స్నానపు గదులు,...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads