jantarmantar_V_jpg--816x480-4g
7TV Focus News

జంత‌ర్ మంత‌ర్ వేదిక‌ను మార్చండి..

న్యూఢిల్లీ 7TV : ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్(Jantar Mantar) వేదిక‌గా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ధ‌ర్నా వేదిక‌ను మ‌రో ప్రాంతానికి మార్చాల‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖ‌లైంది. ఆ పిల్‌ను ప‌రిశీలించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం వ్య‌క్తం చేసింది. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం జంత‌ర్ మంత‌ర్ సరైన వేదిక కాదు అని దాఖ‌లైన పిటీష‌న్ అంశంలో కేంద్రంతో చ‌ర్చించాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మోహ‌తాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స‌తీష్ చాంద్ కౌశిక్ ఆ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. జంత‌ర్ మంత‌ర్ లొకేష‌న్‌లో సీవేజ్‌, ఫుడ్‌, ఇత‌ర వ‌స‌తుల స‌దుపాయం ఏమాత్రం లేవ‌ని పిల్‌లో పేర్కొన్నారు.
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article