జర్నలిస్టులకు ఇళ్ల కేటాయింపు నిష్పక్షపాతంగా జరగాలి
సీనియారిటీ ఆధారంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎంఆర్‌ఓకు వినతి 7టీవీ ఫోకస్ 14-8 కూకట్‌పల్లి మండల పరిధిలో జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు మండల రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కేటాయింపులో అర్హత, సీనియారిటీ, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం పారదర్శకంగా కేటాయింపులు చేపట్టాలని కోరారు. ఏ విధమైన రాజకీయ, వ్యక్తిగత లేదా ఇతర ప్రభావాలకు తావులేకుండా అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.సోమవారం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ను కలిసి ఇదే విషయం పై...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 1 Downloads