జహీరాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులు..
7tv focus : 70 ఏళ్ల చరిత్ర కలిగిన జహీరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఎంపికై రూ.20 కోట్లతో ఆధునిక హంగులతో ముస్తాబవుతోంది. పనులు తుది దశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఎంపిక నుంచి అభివృద్ధి వరకు:దేశవ్యాప్తంగా 1000 స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. తెలంగాణలో 39 స్టేషన్లకు అవకాశం దక్కగా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతిపెద్దదైన జహీరాబాద్ కు చోటు లభించింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వికారాబాద్-పర్లీ మార్గంలో ఈ స్టేషన్ కీలకం. రోజూ 18 ప్యాసింజర్, 12 గూడ్స్ రైళ్లు, వెయ్యి మందికి పైగా ప్రయాణికుల రాకపోకలతో సందడిగా ఉంటుంది....
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads