జీవితాంతం నిలిచే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
అమరావతి 7tv focus : పవిత్రమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని.. అది ప్రేమకు, నమ్మకానికి, బాధ్యతకు, జీవితాంతం నిలిచే అనుబంధానికి ప్రతీకన్నారు. నేటి సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, భద్రంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం, కుటుంబ బంధాలను ప్రేమతో, పరస్పర గౌరవంతో కాపాడుకోవడం అందరి బాధ్యతని చెప్పుకొచ్చారు.రక్షా బంధన్ స్ఫూర్తి కేవలం అన్నాచెల్లెళ్ల బంధానికే పరిమితం కాకూడదన్నారు. ప్రతి మహిళను గౌరవించే సంస్కృతిగా, ప్రతి కుటుంబాన్ని ఏకం చేసే విలువగా, ప్రతి మనిషిలో మానవత్వాన్ని పెంపొందించే సందేశంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన పర్వదినం ప్రతి ఇంట ఆనందాన్ని, ప్రతి హృదయంలో ప్రేమను, ప్రతి కుటుంబంలో...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads