జేపీఎస్‌సీ పేపర్ లీక్‌పై కొనసాగుతున్న ఆందోళనలు..
Jharkhand : జార్ఖండ్‌లో ఇటీవల జరిగిన జేపీఎస్‌సీ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు గత నెల 25 నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపాటు మరో ఐదుగురు విద్యార్థులు రాజధాని రాంచీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల సీజేపీ నిరసన, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను స్ఫూర్తిగా తీసుకుని వీరు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు కూడా జార్ఖండ్‌కు చెందిన వేలాదిమంది విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారు.14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) పరీక్ష, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ)తోపాటు రాష్ట్రంలో నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads