జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
7tv focus : మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఓ నగల దుకాణంలో చోరీ జరగడం కలకలం రేపింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచిన తర్వాతే ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే దుకాణంలో గతంలోనూ చోరీ జరగడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో దుకాణం వెనుక భాగంలోని గది గోడకు రంధ్రం చేశారు. అందులో నుంచి లోపలికి ప్రవేశించి దుకాణంలో ఉన్న వెండి వస్తువులను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు....
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads