TMC_Rebel_M_Ps_1994c3e1b3_V_jpg--625x351-4g
7TV Focus News

టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ 7tv focus : తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీల అనర్హతపై స్పీకర్ విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.అనర్హత అంశంపై నిర్ణీత కాలవ్యవధిలోగా విచారణ జరపాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, ఈ విచారణ సందర్భంగా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. రెబల్ ఎంపీలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article