టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు..
7tv focus : అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో రషీద్ ఈ ఘనతను అందుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్ మారుమణిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో రషీద్ ఖాతాలో 200వ వికెట్ చేరింది.120 మ్యాచుల్లోనే రషీద్ ఖాన్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. 2025 సెప్టెంబర్‌లో న్యూజిలాండ్ మాజీ బౌలర్ టిమ్ సౌథీని అధిగమించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏడాది కాలంగా రషీద్ ఖాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads