టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి..
7tv focus : ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న భర్తను కోల్పోయి తొమ్మిది నెలల గర్భిణి అయిన భార్య, ఐదేళ్ల కుమార్తె దిక్కులేనివారయ్యారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని చర్లపల్లికి చెందిన మధు ఇసుక ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా అదే పనికి వెళ్లాడు. సంపత్ నగర్ నుంచి టేకులపల్లి వైపు వస్తుండగా అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజన్ మధుపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా...
⏱ Top Story
👁 1 Views |
⬇️ 0 Downloads