sailu_V_jpg--816x480-4g
7TV Focus News

ట్రాక్టర్‌ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. 

7tv focus :  ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి టైరు కింద నలిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల సాయిలు (44) ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.స్థానికుల వివరాల ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన సాయిలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తన స్నేహితుడైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇస్మాయిల్‌తో కలిసి ఎంకెపల్లి గ్రామంలో నూతన ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటి మట్టిని తరలించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో మట్టి తరలింపు జరుగుతుండగా సాయిలు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడ్డాడు....
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article