ట్రాఫిక్ రద్దీ నివారణకు డేటా ఆధారిత కార్యాచరణ: జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
గచ్చిబౌలి, జూలై 8 (7 టీవీ ఫోకస్): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు సమగ్ర సర్వేలు నిర్వహించి డేటా ఆధారిత కార్యాచరణ రూపొందించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలు, రద్దీ సమయాలు, రహదారుల సామర్థ్యంపై అధ్యయనం చేపట్టాలని సూచించారు.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో శేరిలింగంపల్లి ట్రాఫిక్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు డేటా ఆధారిత సర్వేలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాల...
⏱ Top Story
👁 37 Views |
⬇️ 0 Downloads