ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
7tvfocusసైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో ఈరోజు సైబరాబాద్ సీపీ కార్యాలయం ఆడిటోరియంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్., సమావేశమయ్యారు.వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో సీపీ మాట్లాడి, శిక్షణలో నేర్చుకున్న అంశాల గురించి తెలుసుకున్నారు. ట్రాఫిక్ విధులను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్ నియంత్రణలో పాటించాల్సిన విధానాలపై సూచనలు చేశారు.శిక్షణలో ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ ఇంజనీరింగ్, చట్టపరమైన అంశాలు వంటి విషయాలపై ఇండోర్, అవుట్‌డోర్ తరగతుల ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే హెల్మెట్ వినియోగం, లేన్ క్రమశిక్షణ, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, మద్యం...
⏱ Top Story
👁 34 Views |
⬇️ 0 Downloads