thorrur-brs2_V_jpg--816x480-3g
7TV Focus News

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు

7tv focus : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇళ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఎక్కడికక్కడ నాయకులను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.పేదలకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులతో సమాధానం చెబుతారా? అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 280 ఇళ్ల పంపిణీ...
⏱ Top Story 👁 15 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article