WhatsApp Image 2026-06-26 at 8.46.17 PM
7TV Focus News

డ్రగ్స్ నియంత్రణకు కఠిన ఆదేశాలు… విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు తప్పనిసరి

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణా, సరఫరా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 26, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, క్రీడా అకాడమీలు, కోచింగ్ సెంటర్లు, విద్యార్థులు, ఉద్యోగులకు వసతి కల్పించే ప్రైవేటు హాస్టళ్లు, పీజీ, కో-లివింగ్ సంస్థలు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమిటీ (ADC)లను...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article