WhatsApp Image 2026-06-26 at 6.02.46 PM (1)
7TV Focus News

డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు.. నిజాంపేట్ మున్సిపల్ అధికారులపై సీపీఐ ఆగ్రహం

కుత్బుల్లాపూర్, జూన్ 26, (7టీవీ ఫోకస్ ప్రతినిధి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రగతి నగర్ డివిజన్ ఇంద్రన్న కాలనీలో వారం రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ డివిజన్ ఇంద్రన్న కాలనీలో గత వారం రోజులుగా డ్రైనేజీ మాన్‌హోల్ పొంగిపొర్లుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిజాంపేట్ సర్కిల్...
⏱ Top Story 👁 15 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article