ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం..
7tv focus : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఢిల్లీలోని చావ్డీ బజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారా వద్ద ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాద సమయంలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads