తమిళనాడులోని ఐదు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
చెన్నై 7tv focus : రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. మదురై, తేని, దిండుగల్, విరుదునగర్, శివగంగ తదితర జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా... దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మన్నార్‌గల్ఫ్ వరకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో బలహీనమైన అల్పపీడన ద్రోణి నెలకొని ఉంది.దాని కారణంగా, రానున్న 48 గంటల్లో ఐదు జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. దక్షిణ జిల్లాలు, అంతర్గత జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొని, గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశముంది.
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads