WhatsApp Image 2026-07-04 at 5.50.17 PM
7TV Focus News

తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఘంటా పద్మశ్రీ

ఏలూరు, జూలై 4 (7 టీవీ ఫోకస్): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు.ఏలూరులోని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేయడం, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article