Tirumala-Venkateshwar_V_jpg--816x480-4g
7TV Focus News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం

7tv focus : శ్రీ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సోమవారం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణ తేజ గెస్టు హౌజ్‌ వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనంఅవుతుందని టీటీడీ సంబంధిత అధికారులు వివరించారు.నిన్న స్వామివారిని 78,228 మంది దర్శించుకోగా 25,564 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.01 కోట్లు ఆదయం వచ్చిందని తెలిపారు. 2.36 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article