maoists_7d0fa29225_V_jpg--625x351-4g
7TV Focus News

తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు.. నేడు మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి.

7tv focus : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం లొంగిపోయిన మావోయిస్టులకు కొత్త జీవితాన్ని చూపుతోంది. వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్న ఈ కేంద్రంలో రక్షాబంధన్‌ సందర్భంగా ప్రత్యేకంగా రాఖీల తయారీ చేపట్టారు. వెయ్యికి పైగా రాఖీలను ఎంతో అందంగా రూపొందించారు. రంగురంగుల దారాలు, పూసలు, ఆకర్షణీయమైన అలంకరణలతో రూపొందించిన ఈ రాఖీలు మార్కెట్లోకి విస్తృతంగా అమ్ముడుపోయాయి. దీంతో తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాంకేర్‌ జిల్లా చౌగేల్‌ గ్రామంలోని పునరావాస కేంద్రం కేవలం శిక్షణ కేంద్రంగానే కాకుండా.. లొంగిపోయిన మావోలకు కొత్త జీవన మార్గాన్ని చూపించే వేదికగా నిలుస్తోంది. రాఖీల తయారీతో పాటు వివిధ వృత్తుల్లో వారికి శిక్షణ ఇస్తున్నారు....
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article