తుఫాన్ సహాయక చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలి: పవన్ కల్యాణ్
అమరావతి, అక్టోబరు 27 (): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) దిశానిర్దేశం చేశారు. తుఫాన్ సన్నద్ధతపై కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఆర్నబ్ విపత్తును సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రంలోపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.. 92 తుఫాన్ ప్రభావిత ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కల్యాణ్...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads