తుమ్మిడిహెట్టిపై చర్చలు ప్రారంభం – ఫడణవీస్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం అంశంపై ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సమావేశం ప్రారంభమైంది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. తుమ్మిడిహెట్టిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రను కోరనున్నారు. ఈ భేటీకి ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు విడిగా భేటీ అయ్యారు.
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads